ప్రజాశక్తి-అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీ (బుధవారం) వరకు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.










