- నెదర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వే గెలుపు
హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ గ్రూప్-ఏలో జింబాబ్వే జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హరారే స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ జట్టు 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 315పరుగులు చేసింది. విక్రమ్‌జిత్, ఎడ్వర్డ్, మాక్స్ ఓ వుడ్ అర్ధసెంచరీలో చేశారు. ఛేదనలో సికిందర్ రాజా 52బంతుల్లో 102పరుగులు సెంచరీతో కదం తొక్కాడు. దీంతో వన్డేల్లో ఫాస్టెస్ట్ జింబాబ్వే తరఫున నమోదు చేశారు. రాజా ఇన్నింగ్స్‌లో ఆరుఫోర్లు, 8సిక్సర్లు ఉన్నాయి. 37ఏళ్ల సికిందర్ రాజా అంతకుముందు 55పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ను కట్టడి చేశాడు. ఛేదనలో జింబాబ్వే జట్టు 40.5ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 319పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సికిందర్ రాజాకు దక్కింది. మరో మ్యాచ్‌లో నేపాల్ జట్టు 6వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచింది. తొలుత అమెరికా 49ఓవర్లలో 207పరుగులు చేయగా.. ఛేదనలో నేపాల్ జట్టు 43ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 211పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కరోవ్ కేసికి లభించింది.










