Apr 05,2023 21:44
  • టాప్‌-10లో భారత్‌నుంచి ముగ్గురు
  • ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌ విడుదల

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) వన్డే బ్యాటర్స్‌ జాబితాలో టీమిండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సత్తా చాటాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన పురుషుల బ్యాటర్స్‌ జాబితాలో శుభ్‌మన్‌ 738రేటింగ్‌ పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకాడు. శుభ్‌మన్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ ఐదు కాగా.. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో డబుల్‌ సెంచరీతో కదం తొక్కడంతో అతని ర్యాంకింగ్‌ మెరుగైంది. అదే క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇదే క్రమంలో టాప్‌-10 వన్డే బ్యాటర్స్‌ జాబితాలో భారత్‌కు చెందిన ముగ్గురికి చోటు దక్కింది. 2, 3 ర్యాంకుల్లో పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇమామ్‌-ఉల్‌-హక్‌ ఉన్నాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. డస్సెన్‌, ఇమామ్‌ ఉల్‌ హాక్‌, గిల్‌, వార్నర్‌, కోహ్లి, డికాక్‌, రోహిత్‌, స్టీవ్‌ స్మిత్‌, ఫకర్‌ జామన్‌ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలర్ల జాబితాలో జోష్‌ హేజిల్‌వుడ్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్డ్‌, సిరాజ్‌, స్టార్క్‌, మ్యాట్‌ హెన్రీ, రషీద్‌ ఖాన్‌, జంపా, షాహీన్‌ అఫ్రిది, ముజీబ్‌ రెహ్మాన్‌, షకీబ్‌ 2 నుంచి 10 ప్లేస్‌ల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. నబీ, రషీద్‌ ఖాన్‌ టాప్‌-3లో ఉన్నారు. ఇటీవలే నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో భారీ శతకం(175) కొట్టిన దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్‌.. ఏకంగా 13స్థానాలు మెరుగుపర్చుకుని 41వ స్థానానికి ఎగబాకాడు.