Jun 22,2023 21:30

హైదరాబాద్‌ : స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌, పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ తమ కంపెనీకి కొత్త బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ శివమ్‌ దూబేను నియమించుకున్నట్లు ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులతో పాటు శివమ్‌ పాల్గోని మాట్లాడారు. పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ దుస్తులు చాలా ఆసక్తిగా, స్టైలిష్‌గా ఉన్నాయన్నారు. మంచి స్టైల్‌ను మెచ్చుకునే వ్యక్తిగా తాను వీటిని విపరీతంగా అభిమానిస్తున్నానని పేర్కొన్నారు.