Jul 14,2023 21:07

ఐటి సూచీల పరుగు
ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో నూతన స్థాయి గరిష్టాలకు చేరాయి. శుక్రవారం చివరి అర్థగంటలో సూచీలు పరుగులు పెట్టాయి. ముఖ్యంగా ఐటి, బ్యాంకింగ్‌ షేర్ల మద్దతుతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 66వేల పాయింట్ల మార్కెట్‌ను అధిగమించింది. సెన్సెక్స్‌ 502 పాయింట్లు రాణించి 66,061కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 19,595 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ా30లో టిసిఎస్‌ అత్యధికంగా 5 శాతం పెరిగింది. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ సూచీలు 4.5శాతం, హెచ్‌సిఎల్‌ టెక్నలాజీస్‌, విప్రో సూచీలు 3 శాతం చొప్పున లాభపడ్డాయి. టాటా స్టీల్‌, నెస్ట్లే, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, ఆసియన్‌ పెయింట్స్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌ షేర్లు ఒక్క శాతంపైనా పెరిగి మార్కెట్లకు మద్దతును అందించాయి. బిఎస్‌ఇలో ఐటి రంగం సూచీ 4.3 శాతం, లోహ సూచీ, రియాల్టీ సూచీలు ఒక్క శాతం చొప్పున రాణించాయి.