Oct 13,2023 13:38

జనగామ : కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని లక్ష్మయ్య లేఖలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపించారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు.