Apr 03,2023 17:21

క్రికెట్‌, క్రికెటేతర ఆదాయం ద్వారా క్రికెటర్లు వందల కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ సంస్థ.. ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్‌-10 క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. వీరిలో అభిమానుల పాలిట క్రికెట్‌ దేవుడిగా మారిన సచిన్‌ టెండూల్కర్‌ రెండోస్థానంలో ఉండగా,ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నెట్‌ వర్త్‌ మొదటి స్థానంలో ఉన్నాడు.
సీఈవో వరల్డ్‌ మ్యాగజైన్‌ నివేదిక ప్రకారం.. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నెట్‌ వర్త్‌ 380 మిలియన్‌ డాలర్లు, సచిన్‌ టెండూల్కర్‌ నెట్‌ వర్త్‌ 170 మిలియన్లు, ఎంఎస్‌ ధోనీ 115 మిలియన్లు, విరాట్‌ కోహ్లీ 112 మిలియన్లు, రికీ పాంటింగ్‌ 75 మిలియన్లు, జాక్వెస్‌ కల్లిస్‌ 70 మిలియన్లు, బ్రియాన్‌ లారా 60 మిలియన్లు, వీరేంద్ర సెహ్వాగ్‌ 40 మిలియన్లు, యువరాజ్‌ సింగ్‌ 35 మిలియన్లు, స్టీవ్‌ స్మిత్‌ 30 మిలియన్లతో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్నారు.