- పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు.. మహిళల టి20 ప్రపంచకప్
కేప్‌టౌన్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్-2 తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149పరుగులు చేసింది. ఛేదనలో భారతజట్టు 19 ఓవర్లలో కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసింది. గెలిచింది. టీమిండియా గెలుపులో మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్(53నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు మునీబా(12), జెవేరియా ఖాన్(8)లను త్వరగా ఔట్ చేశారు. నిదా ధర్(0) కూడా డకౌట్ కావడంతో పాక్ జట్టు 43 పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత అమీన్(11) కూడా నిరాశపరచడంతో పాక్ జట్టు 12.1ఓవర్లలో 68పరుగులకే 4వికెట్లు కోల్పోయింది ఆ దశలో కెప్టెన్ మరూఫ్(68నాటౌట్), అయేషా(43) మరో వికెట్ పడకుండా జట్టు మారూఫ్ బాధ్యతాయుతంగా ఆడారు. కెప్టెన్ మరూఫ్ 55బంతుల్లో 7బౌండరీల సాయంతో 68పరుగులతో అజేయంగా నిలిచింది. చివర్లో ఆయేషా నసీమ్ 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్‌కు రెండు, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో టీమిండియా ఓపెనర్ యస్టికా భాటియా (17), షెఫాలీ వర్మ(33) రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలో 38పరుగులు జతచేశారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్(16) నిరాశపరిచినా.. జెమిమా రోడ్రిగ్స్(53నాటౌట్), వికెట్ కీపర్ రీచా ఘోష్(31నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోడ్రిగ్స్‌కు లభించగా.. 15న భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది.
పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా అలీ (స్టంప్) రీచా (బి)రాధా 12, జెవెరా ఖాన్ (సి)హర్మన్ (బి)దీప్తి 8, మరూఫ్ (నాటౌట్) 68, నిదా ధర్ (సి)రీచా (బి)పూజ 0, అమీన్ (సి)రీచా (బి)రాధా 11, అయేషా (నాటౌట్) 43, అదనం 7. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 149పరుగులు. వికెట్ల పతనం: 1/10, 2/42, 3/43, 4/68 బౌలింగ్: రేణుక 3-0-24-0, దీప్తి 4-0-39-1, గైక్వాడ్ 4-0- 31-0, రాధా 4-0-21-2, పూజ 4-0-30-1, షఫాలీ 1-0-3-0,
ఇండియా మహిళల ఇన్నింగ్స్ : యస్టికా భాటియా (సి)ఫాతిమా (బి)సదియా ఇక్బాల్ 17, షెఫాలీ వర్మ (సి)అమీన్ (బి)నష్రా సంధు 33, జమిమా రోడ్రిగ్స్ (నాటౌట్) 53, హర్మన్‌ప్రీత్ (సి)మరూఫ్ (బి)నష్రా సంధు 16, రీచా ఘోష్ (నాటౌట్) 31, అదనం 1. (19 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 151పరుగులు. వికెట్ల పతనం: 1/38, 2/65, 3/93 బౌలింగ్: ఫాతిమా 4-0-42-0, సదియా ఇక్వాల్ 4-0-25-1, అల్మన్ అన్వర్ (3-0-33-0, నిదా ధర్ 4-0-36-0, నష్రా సంధు 4-0-15-2.
ఆస్ట్రేలియా ఘన విజయం
పార్ల్ : న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్-1 లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 97పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 173పరుగులు చేసింది. హీలే(55), లానింగ్(41), ఫెర్రీ (40) బ్యాటింగ్‌లో మెరిసారు. న్యూజి లాండ్ బౌలర్లు తహుహు, అమేలియా కెర్ర్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 14ఓవర్లలో 76పరుగు లకే కుప్పకూలింది. అమేలియా కెర్ర్(21), జెస్ కెర్ర్(10), బెర్మాడినే(14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. గార్డినర్‌కు ఐదు, స్కట్‌కు రెండు వికెట్లు దక్కాయి.










