Sep 17,2022 11:22

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండల కేంద్రంలో రహదారి వెంబడి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం శనివారం కొనసాగుతోంది. సర్పంచ్‌ మల్లాది రాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి డాక్టర్‌ వి.రవి కుమార్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సర్పంచ్‌ మల్లాది రాణి మాట్లాడుతూ ... మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కఅష్ణ ప్రసాదు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెసిబి ద్వారా ఈ పనులు కొనసాగుతున్నాయని, దీంతో రహదారులు విశాలంగా ప్రజలకు సౌకర్యంగా ఉంటాయని తెలిపారు. గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు.