Jun 10,2023 15:39

టాప్‌ ఆర్డర్‌ విఫలమైన చోట 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రహానేపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. రహానే 'ప్రచారం కోరుకోని ఆటగాడు' అని, తాను ఏం సాధించినా వాటిపై దృష్టిపెట్టకుండా ముందుకు సాగిపోతాడు..సెంచరీ సాధించిన సమయంలోనూ రహానెను చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాడు. అతడు చేసిన సెంచరీలన్నీ టీమిండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేసినవే. ఇలా 'లో ప్రొఫైల్‌'తో ఉండే ప్లేయర్ల జాబితాలో రహానె తప్పక ఉంటాడు'' అని చెప్పారు. రహానెను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ కూడా అభినందించాడు. ''క్రీజ్‌లో రహానె ఇలా యాక్టివ్‌గా కదలడం మునుపెన్నడూ చూడలేదు. అతడి టెక్నిక్‌ సూపర్బ్‌. ఆసీస్‌ బౌలింగ్‌ను కాచుకుని ఆడటం అద్భుతం'' అని పేర్కొన్నాడు.