Aug 16,2022 12:14

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ప్రజాశక్తి ప్రజల పత్రిక అని, ప్రజల్లో విశ్వాసం పెంచుకుని దినదినాభివృద్ధి సాధించాలని ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.నాగేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ప్రజాశక్తి 42 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను మంగళవారం ఎసిపి జి.నాగేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎసిపి జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ... ప్రజాశక్తి ప్రజల పక్షాన నిలుస్తుందని, నిజాలు నిర్భయంగా రాస్తూ అవినీతిరహిత సమాజం కోసం పోరాడుతున్నదని తెలిపారు. రాబోయే రోజులలో కూడా ప్రజాశక్తి మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి నందిగామ డివిజన్‌ ఇన్చార్జి ఎం.శ్రీనివాసరావు, నందిగామ డివిజన్‌ విలేకరి ఆకుల వెంకటనారాయణ, చందర్లపాడు విలేకరి ఎ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.