- పలువురు నేతలు నివాళి
ప్రజాశక్తి - పాములపాడు (నంద్యాల) : ప్రజాశక్తి ఆత్మకూరు డివిజన్ ఇన్‌ఛార్జి సి.హనుమంతు (48) గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించారు. షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సహ క్రీడాకారులు గమనించి ఆత్మకూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం నంద్యాల జిల్లా పాములపాడు మండలం లింగాల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో ప్రజాశక్తిలో ఆయన విలేకరిగా చేరారు. పది సంవత్సరాలుగా ఆత్మకూరు డివిజన్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. హనుమంతు మృతికి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు డి.తులసీదాసు, సిజిఎం వై.అచ్యుతరావు, నవతెలంగాణ సిజిఎం ప్రభాకర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యదర్శులు డి.గౌస్‌దేశారు, టి.రమేష్ కుమార్, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ టి.నరసింహ తదితరులు సంతాపం ప్రకటించారు.