- 43వ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణలో మంత్రి వేణు
ప్రజాశక్తి రామచంద్రపురం(కోనసీమ) : ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పత్రిక ప్రజాశక్తి దినపత్రిక అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజాశక్తి దినపత్రిక 43వ వార్షికోత్సవ సంచికను మంత్రి రామచంద్రపురం పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్న ప్రజాశక్తి పత్రికను విలేకరులను ఆయన అభినందించారు. వార్తను నిర్భయంగా ప్రచురించడంలో ప్రజాశక్తి పత్రిక తీరేవేరని ఆయన కితాబిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేది దినపత్రిక లేనని ఆయన గుర్తు చేశారు. ముందు ముందు మరింత ప్రజాధరణ చూరగొనాలని ఆయన అభిలషించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాధంశెట్టి శ్రీదేవి, వైసిపి నాయకులు శ్రీధర్, వాడ్రేవు సాయి ప్రసాద్, నియోజకవర్గ విలేఖరి సి.హెచ్.దేవానంద్, ప్రజాశక్తి కన్వీనర్ ఎన్ పావన మూర్తి, డివో కొత్తపల్లి ప్రకాష్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.