ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ వైదొలగనున్నట్లు తెలుస్తోంది. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ వ్యతిరేకించడంతో ఆసియా కప్‌కు దూరంగా ఉండే విషయంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మల్లగుల్లాలు పడుతోంది.
కరాచి: ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ వైదొలగనున్నట్లు తెలుస్తోంది. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ వ్యతిరేకించడంతో ఆసియా కప్‌కు దూరంగా ఉండే విషయంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యమివ్వాల్సింది. భద్రత కారణాల వల్ల పాక్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల్ని తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని పీసీబీ ప్రతిపాదించింది. కానీ.. టోర్నీని పాక్ నుంచి తరలించాలన్న బిసిసిఐ ఆలోచనకే శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్‌లు మద్దతు తెలపడంతో పీసీబీ ఆశలు గల్లంతయ్యాయి. ''పాక్ ముందు రెండే దారులు ఉన్నాయి. తటస్థ వేదికలో ఆడటం లేదా టోర్నీ నుంచి వైదొలగడం'' అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి.










