Jul 14,2023 21:31

హైదరాబాద్‌ : దక్షిణాదిలోని 21 నగరాల్లో రక్తహీనతపై అవగాహన కల్పించనున్నట్లు పిఅండ్‌జి హెల్త్‌ వెల్లడించింది. 'నా నా ఎనీమియా బస్సు యాత్ర 2.0' పేరుతో దీన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. 90 రోజులకు పైగా సాగే బస్సు యాత్రలో 2వేల మందికి పైగా వ్యక్తులకు వైద్యులచే ఉచిత స్క్రీనింగ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మిలింద్‌ థాటే తెలిపారు. విశాఖలో ఈ యాత్రను ప్రారంభించామని తెలంగాణ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఈ క్యాంపెయిన్‌ చేపట్టనున్నామన్నారు. ఐరన్‌ లోపం పిల్లలు, గర్భిణులు లేదా రుతుస్రావం ఉన్న మహిళలు సహా అన్ని వయస్సుల వారిని రక్తహీనత ప్రభావితం చేస్తుందన్నారు.