న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో భారత చమురు దిగుమతులు 10 నెలల కనిష్టానికి పడిపోయాయి. గడిచిన నెలలో 18.73 మిలియన్ టన్నుల దిగుమతి చోటు చేసుకోగా.. జులైతో పోల్చితే 4 శాతం తక్కువ, ఏడాదికేడాదితో పోల్చితే 6 శాతం ఎక్కువగా నమోదయ్యాయి ''రష్యా స్వచ్ఛంద ఉత్పత్తి కోతలు కారణంగా వరుసగా మూడవ నెల దిగుమతులు పడిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో సెప్టెంబర్ చివరి వరకు చమురుకు డిమాండ్ తక్కువగా ఉండటంతో.. భారత రిఫైనరీలు దిగుమతులు తగ్గించుకున్నాయి.'' అని పెట్రోలియం అండ్ అనాలిసిస్ సెల్ పేర్కొంది.










