Jun 19,2023 21:29
  • యుఏఇపై 175పరుగుల తేడాతో గెలుపు

హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో శ్రీలంక జట్టు 175పరుగుల తేడాతో యుఏఇపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 355పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. నిస్సంక(57), కరుణరత్నే(52), కుశాల్‌ మెండీస్‌(78), సమరవిక్రమ(73) అర్ధసెంచరీలతో మెరిసారు. బసిల్‌, అయాన్‌, ముస్తఫ, నసీర్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యుఏఇ 39ఓవర్లలో 180పరుగులకే కుప్పకూలింది. హసరంగ(6/24)కి తోడు కుమార, తీక్షణ, ధనుంజయకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అలీ నాసిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హసరంగకు లభించగా.. శ్రీలంక జట్టు 23న ఓమన్‌తో తలపడనుంది.
ఓమన్‌ సంచలనం..

  • ఐర్లాండ్‌పై 5వికెట్ల తేడాతో గెలుపు

గ్రూప్‌-బి మరో మ్యాచ్‌లో ఓమన్‌ జట్టు సంచలనం నమోదు చేసింది. సోమవారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఓమన్‌ జట్టు 5 వికెట్ల తేడాతో పటిష్ట ఐర్లాండ్‌ జట్టుపై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 7వికెట్ల నష్టానికి 281పరుగులు చేయగా.. ఛేదనలో ఓమన్‌ జట్టు 48.1ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 285పరుగులు చేసి విజయం సాధించింఇ. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జీషాన్‌ మసూద్‌కు లభించింది.