Jun 27,2023 21:10

ఐసిఐసిఐ లాంబార్డ్‌ వెల్లడి
ముంబయి : సాధారణ బీమా కంపెనీల్లో ఒక్కటైన ఐసిఐసిఐ లాంబార్డ్‌ కొత్తగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఇ)ల కోసం మూడు వినూత్న బీమా పథకాలను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఇ దినోత్సవం సందర్భంగా ఎంఎస్‌ఎంఇ సురక్షా కవచ్‌ పాలసీ, ప్రాపర్టీ ఆల్‌ రిస్క్‌, ఐ- సెలెక్ట్‌ లయబిలిటీ పాలసీలను విడుదల చేశామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మంత్రి తెలిపారు. విపత్తులు, ప్రమాదాలు, ఆస్తి నష్టాల వల్ల కలిగే నష్టాలను ఇవి పూడ్చుతాయని పేర్కొన్నారు.