- తొలి ప్రదర్శన స్వర్ణకమలాలు
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్‌ఆర్ నాటక కళాపరిషత్ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు.తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాటకరంగంలో తెనాలి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులున్నారన్నారు. సినీడైరెక్టర్ వి. అశోక్ కుమార్, కొల్లిపర మండలానికి వైసిపి నేత కొండా శివారెడ్డికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ పురస్కారాలను అందించారు.
- తొలి ప్రదర్శన 'స్వర్ణ కమలాలు'
నాటిక పోటీల్లో తొలి ప్రదర్శనగా స్వర్ణ కమలాలు నాటికను ప్రదర్శించారు. విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్ ప్రదర్శించిన నాటికకు రచన మునిపల్లి విద్యాధర్ కాగా దర్శకత్వ బాధ్యతలను కత్తి శ్యామ్ ప్రసాద్ నిర్వహించారు. శ్రీ హర్ష ఓ నవలా రచయిత. తన ఊహల్లో ఉన్న ఓ మహిళ అనుకోకుండా ఎదురు పడితే, ఆమెనే వివాహమాడతాడు. ఆమె ఉన్నతికి కృషి చేస్తాడు. సమాజం ఆమెను ప్రశంసించడం శ్రీహర్ష జీర్ణించుకోలేకపోతాడు. చివరికి ఆమెను అర్థం చేసుకుని క్షమాపణ కోరడంతో నాటకం ముగుస్తుంది.










