May 07,2023 13:07
  •  ఓల్డ్‌ సత్యనారాయణ టాకీస్‌ రోడ్డుకు రోశయ్య నామకరణం

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌ ఆదివారం ఆవిష్కరించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని కాటూరి శిల్పశాల శిల్పులు రూపుదిద్దారు. స్థానిక సాలిపేటలోని పాత సత్యనారాయణ టాకీస్‌ మార్గానికి కొణిజేటి రోశయ్య ద్వారంగా నామకరణం చేశారు. అనంతరం మాజీ మంత్రి, టిడిపి నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ట్రస్టీ నూకల వేణు, వైస్‌ ఛైర్మన్‌ మాలేపాటి హరిప్రసాద్‌, పలువురు వైసిపి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.