May 20,2023 16:10

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ విగ్రహం అహింస ఆలోచనను ముందుకు తీసుకెళ్తుందని ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌ లో షేర్‌ చేస్తూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. ''హిరోషిమాలోని ఈ విగ్రహం చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. శాంతి, సామరస్యం అనే గాంధేయ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తాయి. మిలియన్ల మందికి బలాన్ని ఇస్తాయి'' అని ప్రధాని మోడీ జపాన్‌ భాషలో ట్వీట్‌ చేశారు.