- సందడి చేసిన కృష్ణ అభిమానులు, కళాకారులు
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో గ్రామస్తులు, అభిమానులు నెలకొల్పారు. ఎంతో ఆర్భాటంగా వారు ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు శనివారం ఆవిష్కరించారు. మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, శాసన సభ్యులు శివకుమార్, జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, దర్శకులు ఎస్‌వి కృష్ణారెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, దర్శకులు ఎస్‌వి కృష్ణారెడ్డి, నటులు సుధీర్ కుమార్, కష్ణ కుమార్తె మంజుల తదితరులు కృష్ణ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఆర్టిస్టులు మహేష్‌బాబును అనుకరిస్తూ సందడి చేశారు. అనంతరం ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ బుర్రిపాలెం పేరు చెప్పకుండా కష్ణ మాట్లాడేవారు కాదని, గ్రామం అంటే ఆయనకి అమితాభిమానం అన్నారు. గ్రామ అభివృద్ధికి ఆయన ఎంతో కషి చేశారని, ఆయన జ్ఞాపకంగా గ్రామంలో ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. తెలుగు సినిమా రంగంలో కష్ణ పాత్ర చెరగదని అన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ బుర్రిపాలెం పేరు ప్రపంచ స్థాయి గుర్తింపునకు కష్ణ కారణమయ్యారని ప్రశంసించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ హీరో కష్ణ సినీ రంగంలో ఎదిగిన తీరు, ఆయన రాజకీయ జీవితం కూడా ప్రశంసనీయమన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం నటుడు కష్ణకే సొంతమని పేరొకన్నారు. నన్నపనని రాజకుమారి మాట్లాడుతూ స్వగ్రామంపై ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్న నటులలో కష్ణ ఒకరని తెలిపారు. దర్శకులు, నిర్మాత ఎస్వి కష్ణారెడ్డి మాట్లాడుతూ కష్ణతో ఎన్నో చిత్రాలు నిర్మించానని అన్నారు. ఈ సందర్భంగా కష్ణ జీవిత విశేషాలపై సీనియర్ పాత్రికేయులు వినాయకరావు రచించిన దేవుడు లాంటి మనిషి గ్రంథాన్ని ఆవిష్కరించారు.










