Jun 08,2023 09:28

లండన్‌: రెండేళ్ల క్రితం టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో 35 ఏళ్ల అలీని ఈనెల 16 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్‌ టెస్టు సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టుకు ఎంపిక చేశారు. గాయపడ్డ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ స్థానంలో అలీని జట్టులోకి తీసుకున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. కెరీర్‌లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్‌.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు.

యాషెస్‌ సిరీస్‌ తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ జట్టు..
హ్యారీ బ్రూక్‌, బెన్‌ డకెట్‌, జో రూట్‌, జాక్‌ క్రాలే, డేనియల్‌ లారెన్స్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, జానీ బెయిర్‌ స్టో, ఓలీ పోప్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, మాథ్యూ పాట్స్‌, జోష్‌ టంగ్‌, మార్క్‌ వుడ్‌, ఓలీ రాబిన్సన్‌, మొయిన్‌ అలీ