Sep 14,2023 14:33

హైదరాబాద్‌ : పర్యావరణ పరిరక్షణకు గణేశ్‌ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలను పూజించడాన్ని కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వం వివిధ శాఖల తరఫున వివిధ మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా అందిస్తోంది. ఈ ఏడాది హెచ్‌ఎండీఏ అధ్వర్యంలో ఐదు లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా అందించనుంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ 150 వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మరో 50 ప్రాంతాల్లో వీటిని ప్రజలకు ఉచితంగా అందిచనున్నారు.