వాషింగ్టన్ : ఇద్దరు అత్యున్నతస్థాయి మెక్సికన్ రాజకీయ నాయకులు రాబోయే 2024 అధ్యక్ష ఎన్నికలలో నేషనల్ రీజెనరేషన్ మూవ్‌మెంట్ (మోరెనా) పార్టీ నామినేషన్ కోసం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షిన్‌బామ్ ఈ ఎన్నికల బరిలో నిలువనున్నారు. ఈమెతోపాటు విదేశీ సంబంధాల కార్యదర్శి మార్సెలో ఎబ్రార్డ్ కూడా అధ్యక్ష బరిలో వున్నారు. వీరిద్దరూ అధ్యక్ష పదవులకు పోటీ చేయడంతో... సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. క్లాడియా అధికారికంగా ఈ శుక్రవారం నుంచే తన పదవిని వదులుకోనున్నారు.
కాగా, మెక్సికో మేయర్‌గా తన పదవికి రాజీనామా అనంతరం క్లాడియా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా ఆమె దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. అధ్యక్షురాలిగా తనదైన ముద్రవేయాలని భావిస్తున్నట్లు ఆమె ఎన్నికల ప్రచారంలో తన ఎజెండాగా ముందుకు తీసుకెళ్లనున్నారు. తాను ఓ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త అని ప్రచారంలో తన గురించి చెప్పుకున్నారు. అలాగే ఈసారి మహిళా అధ్యక్షురాలికే మెక్సికన్లు మొగ్గుచూపుతున్నారని ఆమె తన ప్రసంగాల్లో వినిపించారు. మెక్సికోలో 'నేషనల్ రీజనరేషన్ మూవ్‌మెంట్ (మోరేనా)'... లెఫ్ట్‌వింగ్ పార్టీ. ఈ పార్టీ తరపునే మేయర్‌గా ఉన్న క్లాడియా అమెరికా అధ్యక్ష బరిలోకి దిగారు.










