Oct 13,2023 12:35

మంగళగిరి (గుంటూరు) : తమ నేతను రక్షించుకోవడానికి సిఎం జగన్‌ ఇంటికెళ్లాలని వినతిపత్రాన్ని ఇవ్వాలని టిడిపి నేతలు నిర్ణయించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం విషయమై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారనీ, ఆయనకు సరైన వైద్యం అందడం లేదంటూ... నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఉదయం టిడిపి నేతలంతా ఎన్‌టిఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. తమ నేత చంద్రబాబును రక్షించుకోవడం కోసం ముఖ్యమంత్రి జగన్‌ ఇంటికెళ్లి వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించామని అచ్చెన్నాయుడు తెలిపారు.