Jan 25,2023 21:04

ముంబయి : ఐడిఎఫ్‌సి ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఐడిఎఫ్‌సి ఎఎంసి) తమ హెడ్‌ ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించుకున్నట్లు ప్రకటించింది. ఈ నూతన బాధ్యతలలో మనీష్‌ ఫండ్‌ హౌస్‌ యొక్క ఈక్విటీ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను చూడనున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈక్విటీ పరిశోధన, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలలో దాదాపు 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. పలు టాప్‌ ఎంఎఫ్‌ కంపెనీల్లో కీలక హోదాల్లో పని చేశారు.