Jan 10,2023 12:44

ప్రజాశక్తి-గోకవరం (తూర్పు గోదావరి) : గ్రామంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెనుక ఉన్న ముస్లిం కాలనీలో నిర్మిస్తున్న డ్రైన్‌ నిర్మాణ పనులకు మంగళవారం గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ... ముస్లిం కాలనీలో డ్రైన్లు లేకపోవడం వల్ల మురుగు నీరు వెళ్లడానికి సరైన మార్గం లేక ఈ ప్రాంతవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి ఇబ్బందులను గమనించి ముస్లిం కాలనీలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆదేశాల మేరకు 5 లక్షలు రూపాయల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులపర్తి బుజ్జి, వైసీపీ నాయకులు వరసాల ప్రసాద్‌, ఎంపీటీసీ తోలేటి రాంప్రసాద్‌, కర్రీ సూరరెడ్డి, కొలిపాకల ప్రకాష్‌, వక్స్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ అలీషా, బొర్రా రాజేష్‌ పాల్గొన్నారు.