Aug 23,2023 14:36

పద్మనాభం: విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం రేవిడిలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఆదినారాయణపై వైసిపి నాయకులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. సర్పంచ్‌ కోనసూరమ్మ అనుచరులే దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. సర్పంచ్‌ కుమారుడి భూ ఆక్రమణలపై స్పందనలో ఫిర్యాదు చేసినందునే తనపై దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆదినారాయణ తగరపువలస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.