ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పల హారిక సహకారంతో బుధవారం ఉదయం సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. డిస్టిక్ మైనింగ్ ఫండ్ రూ.35 లక్షలు, జిల్లా పరిషత్ నిధులు నుండి రూ.4 లక్షలు సిమెంట్ రోడ్డు పనులను వైసిపి సీనియర్ నాయకులు, రెడ్డిగూడెం మండల జడ్పిటిసి సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బోలగాని తిరుపతిరావు, పిఎసిఎస్ అధ్యక్షులు నాదెళ్ల చెన్నకేశవరావు (కేశిబాబు) పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్లూరి శ్రీనివాసరావు, పాలంకి రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గద్దల మారయ్య, మాజీ సర్పంచ్ విస్సంపల్లి రాంబాబు, గద్దల డేవిడ్, ఎంపీడీ. విష్టు ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.










