ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శ్రీశైల ఆలయంలో ఈ నెల 15 నుంచి 24 వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి మంగళవారం ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను మంత్రితోపాటు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు కర్నాటి రాంబాబు దుర్గ గుడి నూతన ఇఒ కెఎస్ రామారావు అందజేశారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయ ఇఒ కెఎస్ రామారావు భారతీనగర్‌లోని మంత్రి కొట్టు సత్యనారాయణ నివాసంలో భేటీ అయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఇఒకు మంత్రి సూచించారు.










