Feb 13,2023 11:35

ముంబయి: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారింది. మూడో టెస్టుకు ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బిసిసిఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ధర్మశాలలో ఔట్‌ఫీల్డ్‌ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణమని బిసిసిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. బిసిసిఐ క్యురేటర్‌ తపోష్‌ ఛటర్జీ ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌పిసిఎ) స్టేడియం పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. అయితే, తొలుత ఈ మ్యాచ్‌ని విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలిస్తారని వార్తలొచ్చాయి. చివరికి ఇందౌర్‌ని వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.