Oct 11,2023 08:42

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :పబ్లిక్‌ సర్వీసెస్‌-డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఇతర రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారా 30.09.24 వరకు జరిగే రిక్రూట్‌మెంట్ల కోసం అన్ని నాన్‌ - యూనిఫామ్‌ సర్వీసుల్లోని పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవల కాలంలో రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో నిరుద్యోగుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వయోపరిమితి పెంచారని పరిశీలకులు పేర్కొంటున్నారు.