Jan 28,2023 21:33
  • నేడు ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఢీ
  • ఐసిసి అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసిసి అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారతజట్టు నేడు ఇంగ్లండ్‌తో తలపడనుంది. సెమీస్‌లో భారత జట్టు 8వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను, ఇంగ్లండ్‌ జట్టు 3పరుగుల తేడాతో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకొచ్చాయి. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు నిర్దేశించిన 108పరుగుల లక్ష్యాన్ని షెఫాలీ నేతృత్వంలో భారతజట్టు 14.2ఓవర్లలో కేవలం 2వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆ మ్యాచ్‌లో పార్శవీ చోప్రా అద్భుత బౌలింగ్‌తో చెలరేగి న్యూజిలాండ్‌ను కట్టడి చేయడంలో సఫలమైంది.. మరో సెమీస్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు 99పరుగులకే ఆలౌట్‌ అయినా.. ఆస్ట్రేలియా జట్టును 96పరుగులకే ఆలౌట్‌ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో భారతజట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి మినహా.. అన్ని మ్యాచుల్లోనూ విజయాలను నమోదు చేసుకుంది. భారత, ఇంగ్లండ్‌ కెప్టెన్లు ఇద్దరికీ సీనియర్‌ జట్టులో ఆడిన అనుభవముంది. ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌ జట్టు 100పరుగుల లక్ష్యాన్ని ఇచ్చి ఆస్ట్రేలియాపై, 103పరుగుల లక్ష్యాన్ని ఇచ్చి పాకిస్తాన్‌పై అద్భుత విజయాలను నమోదు చేసుకుంది. అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌కు ఐసిసి ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
భారత్‌(అండర్‌-19 మహిళలు): షెఫాలీ వర్మ(కెప్టెన్‌), త్రీషా, శిఖా షలోట్‌, శ్వేతా షెర్లావత్‌, సౌమ్య తివారి, హర్లీ గాలే, సోనియా మెంథియా, యశశ్రీ, హ్రిశితా బసు, రిచా ఘోష్‌(వికెట్‌ కీపర్లు), అర్చనా దేవి, ఫలక్‌ నాజ్‌, మనత్‌ కశ్యప్‌, నజ్లా నౌషాద్‌, పర్షవీ చోప్రా, షబ్నమ్‌, సోనమ్‌ ముఖేశ్‌, టిటాస్‌ సధూ.
ఇంగ్లండ్‌(అండర్‌-19మహిళలు): గ్రేస్‌ స్కీవెన్స్‌(కెప్టెన్‌), ఛారిస్‌, డావినా, జమిమా, లిబర్టీ, హోలండ్‌, స్టోన్‌హౌస్‌, గ్రోవిస్‌, మెక్‌డొనాల్డ్‌, వార్డ్‌, సరెన్‌ స్మాలె (వికెట్‌ కీపర్లు), మిల్స్‌, లాంబర్ట్‌, అండర్సన్‌, ఛరమ్స్‌, బోకెర్‌, స్కౌట్‌, టేలర్‌, సోఫియా.