Jun 18,2023 12:07

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఆసీస్‌ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖావాజా 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు అలెక్స్‌ క్యారీ(52) పరుగులతో ఉన్నారు. ఇక సెంచరీతో చెలరేగిన ఖ్వాజా స్పెషల్‌ సెల్‌బ్రెషన్స్‌ జరపుకున్నాడు. సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే గట్టిగా అరుస్తూ తన బ్యాట్‌ను కిందకు విసిరి, ఆసీస్‌ డ్రస్సెంగ్‌ రూమ్‌ వైపు చూస్తూ చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ఆటగాళ్లు కూడా స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు. ఖ్వాజా సెల్‌బ్రెషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.