Sep 10,2022 14:17

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : గణపతి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని వినాయకుడి నిమజ్జనాలు మండపేటలో ప్రారంభమయ్యాయి. శనివారం బొజ్జ గణపయ్యకు ఆఖరి పూజలు నిర్వహించి సాగనంపారు. భక్తులు మండపేట పట్టణంలో వాడవాడలా నెలకొల్పిన గణనాథులను నిమజ్జనానికి పెద్ద కాలువకు తరలించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు వారి వారి స్థాయిల్లో ఊరేగింపుగా కొనసాగారు. గణేశ్‌ రిబ్బన్‌ లు తలకు కట్టుకుని , రంగులు పూసుకుని దారి పొడవునా డప్పు వాయిద్యాలతో సందడి చేసుకుంటూ తీసుకువెళ్ళారు. వివిధ రకాల ప్రసాదాలను పంచి పెట్టారు. ఈ ఏడాది మండపేటలో గణపతి వేడుకల్లో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.