ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం రైల్వేకోడూరు పట్టణంలోని హెచ్‌ఎంఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొరముట్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నిరుద్యోగులకు కల్పిస్తున్న ఉపాధి చూసి వైసిపి మద్దతుదారులకు పట్టం కట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వజారెడ్డి, రైతు సలహా మండలి జిల్లా చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట శివ సాయి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్ రాజు,మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు సర్పంచులు హరికష్ణ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజు శ్రీరామ్ వినోద్ కే బుడుగుంట పల్లె సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ యజ్ఞం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.










