Sep 30,2023 10:41

ప్రజాశక్తి-అమరావతి : ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనను నిందితుడిగా చేసిందని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని శుక్రవారం విచారించిన జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి కౌంటర్‌ దాఖలు చేయాలని సిఐడిని ఆదేశించారు. విచారణను అక్టోబరు 4కు వాయిదా వేశారు. 2021 సెప్టెంబరులో నమోదు చేసిన కేసులో 25వ నిందితుడిగా చంద్రబాబును సిఐడి చేర్చిందని, ఎసిబి కోర్టులో పిటి వారెంట్‌ దాఖలు చేసిందని ఆయన సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు స్కాంలో రూ.321 కోట్లు అక్రమాలు జరిగాయని, దీని వెనుక పెద్దల ప్రమేయం ఉందని సిఐడికి ఎపి ఫైబర్‌ నెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎమ్‌డి ఫిర్యాదు చేశారు.