ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 102ను చిత్తశుద్ధితో అమలు చేయాలని కెవిపిఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఉండకుండా పోస్టులను ప్రకటించాలన్నారు. గత పదేళ్ల నుంచి ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఇప్పటికైనా సయమపాలన బట్టి భర్తీ చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని బ్యాక్‌లాగ్ పోస్టులను జిల్లా కలెక్టరు తెప్పించి చర్యలు తీసుకోవాలన్నారు.










