ప్రజాశక్తి -మంగళగిరి :ఎస్సీ ,ఎస్టీ ప్రజలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకుంటే ఉచితంగా కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయిందని పలువురు ఎస్‌సి కాలనీ ప్రజలు వాపోయారు. సిపిఎం ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మంగళగిరి పట్టణంలోని గోపాలకృష్ణ సెంటర్ ఎదురుగా ఉన్న ఎస్సీ ప్రాంతాన్ని, 13వ వార్డు లోని ఇస్లాంపేట ప్రాంతాన్ని సందర్శించారు. ఇంటింటికి తిరిగి సిపిఎం బఅందం ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో కార్పెంటర్ ఈ పనులు చేసి జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ పని కూడా లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల తనకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని అన్నారు. కుటుంబ ఖర్చు పెరుగుతుందని ఆదాయం పెరగడం లేదని తెలిపారు. అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్డుపై డివైడర్ నిర్మాణం చేయడంవల్ల పడమర వైపు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో దారి ఉండేదని, ఇప్పుడు దారి లేకుండా నిర్మాణం చేశారని వాపోయారు. ఐరన్ రేట్లు పెరగడం వల్ల బీరువాలు తయారు చేసే వారికి ఉపాధి లేకుండా పోయిందని పలువురు వాపోయారు. గతంలో ఎమ్మెల్యే ఇస్లాం పేట లో రోడ్డు ఇస్తామని చెప్పి వేయకుండా గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా రాలేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. గ్యాస్, కరెంట్ చార్జీలు విపరీతంగా పెరగడం వలన చెల్లించలేక పోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జె వి రాఘవులు, పట్టణ కార్యదర్శి వై కమలాకర్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకఅష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.










