Apr 18,2023 12:15

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు ఆదేశాల మేరకు మండలంలోని మడికికి చెందిన చెలబోయిన సింహాచలాన్ని మండల బీసీ సెల్‌ అధ్యక్షుడుగా నియమించిన విషయం విదితమే. దీంతో సింహాచలం వాడపాలెంలోని బండారు నివాసంలో సత్యానందరావును మర్యాద పూర్వకంగా కలవగా సింహాచలాని అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా సింహాచలం మడికిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి సహకరించిన టీడీపీ సీనియర్‌ నాయకులు ఒంటిపల్లి సతీష్‌, రామానుజుల శేషయ్య, ఈదల నల్లబాబు, న్యాయవాది సునీల్‌, కేతా శ్రీను, ఈదల సత్తిబాబు, చుండ్రు శ్రీను, రాయుడు సుధాకర్‌, మెర్ల గోపాలస్వామి, దొండపాటి సుబ్బరాజు, ఈదల రమేష్‌, మల్యాల రాజేష్‌, కొత్తపల్లి కఅష్ణ, అడ్డాల రాజు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.