బోయినపల్లి (హైదరాబాద్) : తన ఇద్దరు కుమార్తెలకు నిద్రమాత్రలిచ్చి తాను కూడా నిద్రమాత్రలు మింగి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ బోయినపల్లి పిఎస్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని భవానీనగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్ కుటుంబ కలహాల నేపథ్యంలో .... తన ఇద్దరు కుమార్తెలు శ్రావ్య (7), స్రవంతి (8) లకు నిద్రమాత్రలిచ్చి తాను కూడా తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










