Nov 14,2023 17:44

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 606 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పరిశీలన తర్వాత ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 3న ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. ఈ నెల 10 వరకు నామినేషన్ల కార్యక్రమం కొనసాగింది. 4798 మంది అభ్యర్థులు 5716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నటి నుంచి నామినేషన్ల పరిశీలన కొనసాగింది. అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆ తర్వాత మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58, ఎల్బీనగర్‌లో 50, కొడంగల్‌లో 15 మంది, బాల్కండలో 9 బరిలో ఉండగా.. అత్యల్పంగా నారాయణపేటలో 7 మంది అభ్యర్థులు పోటీలో ఉండననున్నారు.