Jun 04,2023 10:44

భారత్‌తో ది ఓవల్‌లో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్‌.. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది. ఐర్లాండ్‌తో ప్రకటించిన జట్టునే యాషెస్‌ సిరీస్‌ తొలి రెండు టెస్టులలో కొనసాగించింది.ఐర్లాండ్‌ తో మ్యాచ్‌ లో అరంగేట్రం చేసిన జోష్‌ టంగ్‌. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌, మార్క్‌ వుడ్‌ కూడా టీమ్‌తో కలిశాడు.

తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్‌ జట్టు : బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), ఓలీ పోప్‌, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జేమ్స్‌ అండర్సన్‌, హ్యారీ బ్రూక్‌, జాక్‌ లీచ్‌, బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే, మాథ్యూ పాట్స్‌, ఓలీ రాబిన్సన్‌, డాన్‌ లారెన్స్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, జోష్‌ టంగ్‌

యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ 
మొదటి టెస్టు : జూన్‌ 16 - 20 - ఎడ్జ్‌బాస్టన్‌ (బర్మింగ్‌హామ్‌)
రెండో టెస్టు : జూన్‌ 28 - జులై 2 - లార్డ్స్‌ (లండన్‌)
మూడో టెస్టు : జులై 6 - 10 - హెడింగ్లీ (లీడ్స్‌)
నాలుగో టెస్టు : జులై 19 - 23 - ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ (మాంచెస్టర్‌)
ఐదో టెస్టు : జులై 27 - 31 - కియా ఓవల్‌ (లండన్‌)