కేప్‌టౌన్ : ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై నెగ్గిన ఇంగ్లండ్.. సోమవారం ఐర్లాండ్‌పై 4వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్- 2లో అగ్రస్థానంలో నిలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు 18.2 ఓవర్లలో 105పరుగులకు కుప్పకూలింది. లెవీస్(36), అమె హంటర్(15) బ్యాటిం గ్‌లో రాణించగా.. ఎక్లేస్టోన్, గ్లెన్‌కు మూడేసి, ఛార్లీ డీన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ జట్టు 14.2 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 107పరుగులు చేసి గెలిచింది. క్యాప్సే(51), వాట్(16) బ్యాటింగ్‌లో రాణిం చారు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ క్యాప్సేకు లభించింది.
శ్రీలంకకు రెండో విజయం
న్యూలాండ్స్ వేదికగా ఆదివారం జరిగిన మరో మ్యా చ్‌లో శ్రీలంక జట్టు 7వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. బంగ్లాజట్లు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126పరుగులు చేయగా.. లంక జట్టు 18.2 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 129పరుగులు చేసి గెలిచింది. హర్షిత(69), డిసిల్వ(41) బ్యాటింగ్‌లో రాణిం చారు. హర్షితకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు..
ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్(రాత్రి 10.30గం||లకు)










