ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ... ఈనెల 25న చేపట్టనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని నందిగామ మున్సిపల్ కార్మికుల ఇంజనీరింగ్ విభాగం శుక్రవారం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ ... ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం కార్మికులు శీను, రవి, బాలు, మెకాయేలు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.










