Nov 01,2022 21:02

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న ఎలన్‌ మస్క్‌ ఆ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు అందరికీ ఉద్వాసన పలికారు. మరోవైపు.. ఇకపై ట్విట్టర్‌కు తానే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా కొనసాగనున్నట్లు మస్క్‌ స్వయంగా ప్రకటించుకున్నారు. కంపెనీలో కూడా మస్క్‌ ఒక్కరే డైరెక్టర్‌గా మిగలడం విశేషం. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థ సిఇఒ పరాగ్‌ అగర్వాల్‌తో పాటు కీలక అధికారులను బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.