Oct 12,2023 21:44

ప్రజాశక్తి - రామకుప్పం (తిరుపతి జిల్లా):అరటి, వరి పంటలపై ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజులుగా తిరుపతి జిల్లా రామకుప్పం మండలంలోని ఎస్‌.గొల్లపల్లి గ్రామ పరిసరాల్లో ఏనుగులు తిష్టవేశాయి. గ్రామానికి చెందిన సోమశేఖర్‌, కఅష్ణప్ప, బివి సుబ్రమణ్యం అనే రైతులకు చెందిన పంట పొలాలను ధ్వంసం చేశాయి. పంట పొలాలపై ఏనుగుల దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నామమాత్రంగా పంట నష్టపరిహారం చెల్లిస్తున్నారని, శాశ్వత పరిష్కారాలను అధికారులు చేయడంలేదని వాపోయారు. అటవీ చుట్టూ పూర్తి స్థాయిలో కంచే వేసి అడవి జంతువులు గ్రామాలవైపు రాకుండా అటవీ శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు.