అమరావతి : ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేపడుతున్నామని ఎపి జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ... త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. బాబు, లోకేష్ ఇద్దరూ వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి ? అని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని చెప్పారు. టిడిపి నాశనం అవ్వడానికి కారణం లోకేషేనన్నారు. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టిడిపి కి మద్దతిస్తారని అడిగారు. టిడిపిని కాపాడటం ఎవరి వల్లా కాదు అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.










