Jul 15,2023 21:30

న్యూఢిల్లీ : ప్రముఖ రిటైల్‌ చెయిన్‌ డిమార్ట్‌ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మర్ట్స్‌ లిమిటెడ్‌ 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 2.46 శాతం వృద్థితో రూ.658.71 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. వస్త్రాలు, సాధారణ ఉ్పత్పత్తుల అమ్మకాల్లో తగ్గుదల మార్జిన్లపై ప్రభావం చూపిందని ఆ సంస్థ పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.642 కోట్ల లాభాలు ఆర్జించింది. గడిచిన ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 18.20 శాతం పెరిగి రూ.11,86544 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం వ్యయాలు 19.74 శాతం పెరిగి రూ.11,006.92 కోట్లుగా నమోదయ్యాయి. గడిచిన త్రైమాసికంలో కొత్తగా మూడు స్టోర్లను తెరవడంతో మొత్తం అవుట్‌లెట్ల సంఖ్య 327కు చేరాయి.